04-03-2025 12:02:50 AM
పట్టుబడ్డ విత్తనాల విలువ రూ.6.85 లక్షలు
ఐదుగురు వ్యక్తులు అరెస్ట్.. బైకు స్వాధీనం
బెల్లంపల్లి, మార్చి 3 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా భీమిని మండలం మల్లీడి క్రాస్ రోడ్ వద్ద సోమవారం 2.74 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు, వ్యవసాయ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. పట్టుబడ్డ విత్తనాల విలువ రూ 6 లక్షల 85 వేల వరకు ఉంటుందని అంచనా వేశారు.
నకిలీ విత్తనాల దందాకు పాల్పడుతున్న 5 గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఒక పల్సర్ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్ భీమిని పోలీస్ స్టేషన్ లో విలేకరులకు వెల్లడించారు.