10-03-2025 05:06:45 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పామ్ ఆయిల్ రైతుల కోసం మంజూరైన ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం పనులకు అనుమతి ఇప్పించాలని కోరుతూ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పామాయిల్ రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందించారు. జిల్లాలో మంజూరైన ఫ్యాక్టరీని ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని పెండింగ్ పనుల అనుమతులను సంప్రదింపులు నిర్వహించి అనుమతులు ఇప్పించాలని రైతులను ఆదుకోవాలని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమం రైతులు నాయకులు ధర్మాజీ రాజేందర్ పాకాల రామచందర్ రామయ్య రామ్ రెడ్డి నారాయణరెడ్డి ప్రదీప్ తదితరులు ఉన్నారు.