18-04-2025 12:00:00 AM
వాంకిడి, ఏప్రిల్ 17(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టం ద్వారా భూ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంక టేష్ దోత్రే అన్నారు. గురువారం వాంకిడి మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్,ఆర్డిఓ లోకేశ్వర్ రావులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టం ద్వారా హక్కులు, భూ సమస్యలుసత్వర పరిష్కారం జరుగుతాయని తెలిపారు. భూభా రతి చట్టం రైతులకు ఎంతో మేలు చేస్తుంద ని, ఈ చట్టం వల్ల నిజమైన భూమి యజమానికి న్యాయం జరుగుతుందని తెలిపారు. ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని ప్రభు త్వం తీసుకు వచ్చిందని, హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం ఉందని, భూ సమస్యల పరిష్కారంలో అప్పీల్ వ్యవ స్థ ఉందని తెలిపారు.
తహసీల్దార్ జారీ చేసి న ఆర్డర్‌పై ఆర్డీవోకు అప్పీలు చేసుకోవచ్చని, ఆర్డీవో జారీ చేసిన ఆర్డర్‌పై కలెక్టర్‌కు అప్పీ లు చేసుకునే వెసులుబాటు తీసుకువచ్చిందని తెలిపారు. ఇది వరకు ధరణి పోర్టల్‌లో ఈ అవకాశం లేదని, విరాసత్ పట్టా మార్పి డిపై సంబంధిత పట్టాదారు లకు నోటీసులు జారీ చేసే విధానాన్ని తీసుకువచ్చిందని తెలిపారు.
కొనుగోలు, దానం, తనఖా, పాలు పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసిల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులలో మార్పు చేసి పట్టాదారు పాసు పుస్తకాన్ని జారీ చేస్తారని, ఈ ప్రక్రియ ఒకేరోజులో పూర్తి అయ్యే విధంగా చట్టంలో పొందుపరిచారని తెలిపారు.
భూభారతిలో చాలా సులభమైన మాడ్యూల్ తీసుకురావడం జరిగిందని, ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుందని, భూభారతి చట్టంలోని హక్కులు, అంశాలపై ప్రతి రైతు, అధికారులు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీ ల్దార్ రియాజ్ అలీ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రవీణ్, రైతులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.