18-04-2025 01:05:44 AM
టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి
సంగారెడ్డి, ఏప్రిల్ 17(విజయక్రాంతి) :భూ భారతి ఆర్వోఆర్ చట్టం 2025 ద్వారా రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు టీజీఐఐసీ చైర్మ న్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. రైతులకు భూ భారతిపై అవగాహన సదస్సును గురువారం సదాశివపేట మండలానికి చెందిన రైతులకు పట్టణంలోని దుర్గా ఫంక్షన్ హాల్ లోనూ, కొండాపూర్ మండలానికి సంబంధించిన భూభారతి అవగాహన సదస్సును మల్కాపూర్ శివారులోని గోకుల్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్మలాజగ్గారెడ్డి, కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ..ప్రభుత్వం జై జవాన్ జై కిసాన్ నినాదంతో ముందుకెళ్తుందన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. గత ప్రభు త్వం అమలు చేసిన లోప భూయిష్టమైన ధరణి వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు.
రైతుల ఇబ్బందులను శాశ్వత పరిష్కారం కోసం రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పు లు తీసుకొచ్చి అధికార వికేంద్రీకరణ జరిగేలా సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో కీలక మా ర్పులు తెస్తూ ఏప్రిల్ 14వ తేదీన భూభారతి నూతన ఆర్వోఆర్ చట్టం 20 25 ను అమల్లోకి తీసుకువచ్చింది అన్నారు.
ఈ చట్టం ద్వారా రెవెన్యూ సమస్యలు శాశ్వత పరిష్కారం లభించనున్నట్లు తెలిపారు. రెవెన్యూ వ్యవస్థలో అధికార వికేంద్రీకరణకు నూతన చట్టం దోహద పడుతుందన్నారు. ఒక రిజిస్ట్రేషన్ లేదా పౌతీ చేయాలంటే సంబంధిత అర్జీదారులకు నోటీసులు ఇవ్వడంతో పాటు సర్వే మ్యాప్ గ్రామస్థాయిలో విచారణ లాంటి కార్యక్రమాలు భూభారతిలో ఉండ డం వల్ల తప్పులు జరిగే అవకాశం తగ్గిందన్నారు.
దీంతో భూ పరిపాలనలో పారదర్శకత ఏర్పడుతుందన్నారు. ఈ చట్టంపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం అన్ని మండలాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) మాధురి, పౌరసరఫల శాఖ జిల్లా మేనేజర్ అంబదాస్ రాజేశ్వర్ సంగారెడ్డి ఆర్డిఓ రవీందర్ రెడ్డి, సి డి సి చైర్మన్ రామ్ రెడ్డి, ఆత్మ చైర్మన్ ప్రభు మార్కెటింగ్ చైర్మన్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఉమా, ఎంపీడీవో లక్ష్మి, స్థానిక సదాశివపేట తహసిల్దార్ సరస్వతి, కొండాపూర్ తహసీల్దార్ అశోక్, మండల రెవెన్యూ అధికారులు, పి ఎ సి ఎస్ చైర్మన్ లు, వ్య వసాయ అధికారులు రైతు సంఘం నాయకులు, రైతులు, తదితరులుపాల్గొన్నారు.