calender_icon.png 25 April, 2025 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ భారతి చట్టంతో భూ సమస్యలకు సత్వర పరిష్కారం

25-04-2025 04:18:09 PM

కలెక్టర్ తేజస్ నందలాల్..

మునగాల: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని, ఇకనుంచి రైతులకు భూములకు సంబంధించిన ఇబ్బందులు ఉండవని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్(District Collector Tejas Nandalal) అన్నారు. శుక్రవారం మండల కేంద్రము జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... నూతన భూ భారతి చట్టం 2025 ద్వారా రైతులకు ఉచిత న్యాయ సేవలు, అందుబాటులో ఉన్నాయని, తమ సమస్యను దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉందని, వివిధ స్థాయిలో నిర్ణీత సమయాలలో దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుకు న్యాయంచేయడం జరుగుతుందన్నారు.

అదనపు కలెక్టర్ రాంబాబు మాట్లాడుతూ.. త్వరలో మండలంలో స్పెషల్ డ్రైవ్  నిర్వహించి రైతుల నుండి భూములకు సంబంధించి  సమస్యలు, విజ్ఞప్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం గ్రామ పరిపాలన అధికారి, మండల సర్వేయర్లను నియమించి తద్వారా క్షేత్రస్థాయిలో నూతన రికార్డుల నిర్వహణకు సులభతర చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు.  

ఈ కార్యక్రమంలో ఆర్డిఓ సూర్యనారాయణ, సిఐ రామకృష్ణారెడ్డి, ఏడిఏ ఎల్లయ్య, మండల ప్రత్యేక అధికారులు శిరీష, ఎమ్మార్వో వలిగొండ ఆంజనేయులు, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, ఎస్సై ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు నల్లపాటి శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటయ్య, బాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొలిశెట్టి బుచ్చి పాపయ్య, పీసెస్ చైర్మన్లు రామ్ రెడ్డి, తోగరు సీతారాములు, చందా చంద్రయ్య, సుంకర అజయ్ కుమార్, బుర్రి శ్రీరాములు, మొలకలపల్లి రాములు, తోగరు రమేష్, జానకి రెడ్డి, యూత్ కాంగ్రెస్ సాయి, ఉత్తమ యువసేన అధ్యక్షుడు తోగటి వేలాద్రి తదితరులు పాల్గొన్నారు.