calender_icon.png 28 September, 2024 | 8:54 AM

సత్వరంపూర్తి.. అధిక ఆయకట్టు

27-09-2024 12:39:17 AM

అలాంటి ప్రాజెక్టులకే మొదటి ప్రాధాన్యం

గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లులు చెల్లించాలి

ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టుల పూర్తి

నీటిపారుదల సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయ క్రాంతి): తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందించే ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లుల చెల్లించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గోదావరి, కృష్ణా బేసిన్‌లో ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టులకు నిధులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థిక శాఖకు సూచించారు. సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు.

ఆరు నెలల్లో వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవా లని సూచించారు. గురువారం సాయంత్రం జలసౌధలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాబోయే రెండేండ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖకు దిశా నిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు నిర్ణీత గడువులోపు లక్ష్యాలను నెరవేర్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని చెప్పారు.

ఎప్పుడో ఐదేళ్లకు ఆరేళ్లకు పూర్తి కాని ప్రాజెక్టులపై దృష్టి పెట్టి అక్కడ నిధులు ఖర్చు చేస్తే లాభం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే 75 శాతం, అంతకు మించి పనులు చేసిన ప్రాజెక్టులను పూర్తిచేస్తే వచ్చే ఖరీఫ్‌లోగా మరింత ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశముందని తెలిపారు. పనులు పూర్తి చేసేందుకు ఉన్న అడ్డం కులు, అవరోధంగా ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలతోపాటె రెవెన్యూ విభాగంతో ఇరిగేషన్ విభాగం జాయింట్ మీటిం గ్ ఏర్పాటు చేసుకొని యాక్షన్ ప్లాన్ తయా రు చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించా రు.

పనులు చేపట్టి భూసేకరణ నిలిచిపోయిందనే సమస్య తలెత్తకుండా చూసుకోవా లని, కొనసాగుతున్న ప్రాజెక్టులన్నింటిలోనూ ముందుగా భూ సేకరణ చేయాలని సీఎం సూచించారు. భూసేకరణలోనూ మానవీయత ఉండాలని, భూములు ఇచ్చే వారితో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సంప్రదింపులు జరపాలని చెప్పారు.