calender_icon.png 29 September, 2024 | 10:01 PM

నగరాల్లో క్విక్ కామర్స్ ట్రెండ్

28-09-2024 01:52:19 AM

  1. కిరాణా సామగ్రికి ఆన్‌లైన్‌పైనే ఆధారం
  2. ఇన్‌స్టాంట్ డెలివరీకే మొగ్గు చూపుతున్న ప్రజలు
  3. షాపింగ్ ఫ్రీక్వెన్సీ కూడా భారీగా పెరుగుతోంది
  4. ఎన్‌ఐక్యూ పరిశోధనలో వెల్లడి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: రోజురోజుకూ ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యవస్థ వేగం గా విస్తరిస్తోంది. ప్రతి వస్తువును నేడు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయగలుగుతున్నాం. ఒక ప్పుడు ఈ ఎలక్ట్రానిక్స్, దుస్తులు, ఇతర వస్తువుల కొనుగోలుకే ప్రధానంగా వినియోగించేవాళ్లు.

కానీ ఇప్పుడు గ్రాసరీ, పండ్లు, కూరగాయలు, మాంసం కూడా ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. గతంలో ఆర్డర్ చేసిన తర్వాత కనీసం ఒకరోజు తర్వాత డెలీవరి జరిగేది. ఇప్పుడు క్విక్ కామర్స్ రావడంతో ఆర్డర్ చేసిన 7 నుంచి 10 నిమిషాల్లోపు ఇన్‌స్టాంట్ డెలీవరి చేస్తున్నారు. దీంతో పట్టణవాసులు ఎక్కువగా జెప్టో, స్విగ్గీమార్ట్, బ్లింకిట్ వంటి క్విక్ కామర్స్ స్టోర్ల వైపే మొగ్గు చూపుతున్నారు. 

మెట్రో నగరాల్లో ఎక్కవగా..

ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారిలో 31 శాతం మంది క్విక్ కామర్స్‌పైనే ఆధారపడుతున్నట్లు నీల్సెన్‌ఐక్యూ (ఎన్‌ఐక్యూ) నివేదిక వెల్లడించింది. 39 శాతం మంది టాప్‌అప్ కొనుగోళ్లు చేస్తున్నట్లు తెలిపింది. ఎన్‌ఐక్యూ దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాల్లో 4,500 మంది వినియోగదారులను సర్వే చేసినట్లు ఎన్‌ఐక్యూ తెలిపి ంది.

హైపర్, సూపర్‌మార్కెట్లు, టీటీ స్టోర్లు, ఆన్‌లైన్ స్టోర్లలో కిరాణా సామగ్రిని కొనుగోలు చేసే 18 ఏళ్ల వయసు గల వ్యక్తుల షాపింగ్ అలవాట్లను ఇది పరిశీలించింది. ఈ అధ్యయనం ప్రకారం 42 శాతం రెడీ టూ ఈట్ మీల్స్, 45 శాతం స్నాక్స్ కోసం కామర్స్ సైట్లపై ఆధారపడుతున్నట్లు గుర్తించారు. 

మళ్లీ రిటైల్ సామర్థ్యం పెరుగుతోంది

వివిధ మాధ్యమాల్లో షాపింగ్ ప్రవర్తనలోనూ భారీ మార్పులు వచ్చినట్లు నివేదిక పేర్కొంది. ఆన్‌లైన్ వేదికల్లో కొనుగోలుదారులు భాగమవుతున్నారని తెలిపింది. షాపిం గ్ ఫ్రీక్వెన్సీ భారీగా పెరుగుతోందని వెల్లడించింది. మల్టీచానెల్ షాపింగ్‌ను ఎక్కువగా ఆదరిస్తున్నందున ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసేవారిలో 20 శాతం మంది తమ కిరాణా అవ సరాల కోసం ఆన్‌లైన్ స్టోర్లవైపు మొగ్గుచూపుతున్నారు.

ఇది ఎక్కువగా మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాన షాపింగ్ కోసం ఎక్కువగా నగరవాసులు ఆన్‌లైన్ స్టోర్లపైనే ఆధారపడుతు న్నారు అని నివేదిక పేర్కొంది. ఈ పరిణామంతో నిత్యావసర వస్తువులు (ఎఫ్‌ఎంసీజీ) రిటైల్ సామర్థ్యం కూడా మళ్లీ పెరుగుతోంది. అయితే, క్విక్ కామర్స్‌ను ప్రత్యేకించి అత్యవసర, తక్షణ అవసరాల కోసం ఎక్కువగా వినియోగిస్తున్నట్లు నివేదిక తెలిపింది.