- ఇటీవల కాగ్నిజెంట్... ఇప్పుడు జొయిటిస్ రాక
- ఒప్పందాల నుంచి స్థాపన దాకా ప్రభుత్వం చొరవ
- అమెరికా తర్వాత హైదరాబాద్‌లోనే కేపబులిటి సెంటర్
- అత్యాధునిక టెక్నాలజీతో వ్యాక్సిన్లు, మెడిసిన్ తయారీ
- హైదరాబాదే అనువైన ప్రాంతమని కంపెనీ కితాబు
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయ క్రాంతి): తెలంగాణలోని యువతకు ఉపాధి కల్పించడంలోనూ ప్రభుత్వం అద్భుత పనితీరును కనబరుస్తుంది. ఐటీ కంపెనీలు, ఆయా రంగాలకు సంబంధించి పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నది. ప్రభుత్వం ఏర్పడిన అనతికాలంలోనే రెండు విదేశీ పర్యటనలు చేసి అనేక కంపెనీలను హైదరాబాద్‌లో స్థాపించాలని సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానించా రు.
కేవలం పర్యటనలతోనే సరిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న కంపెనీల ఏర్పాటుకు చొరవ చూపిస్తున్నారు. యువతకు ఉపాధి అవకా శాలను పెంచడంపై మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో ఒప్పందం చేసుకున్న కంపెనీల్లో ఇప్పటి కే కాగ్నిజెంట్ కంపెనీ తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో విస్తరించగా, ప్రస్తుతం జొయిటిస్ కంపెనీ కూడా అదే తరహాలో ముందుకు వచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లోని నాల్జెడ్ సిటీలో వారి కార్యాలయాన్ని ప్రారంభించింది. గత నెల పదో తేదీన ఒప్పందం చేసుకుని ఈ నెల పదో తేదీన కంపెనీ ప్రారంభించడం విశేషం.
అమెరికా తర్వాత హైదరాబాద్‌లోనే
జంతు ఆరోగ్య సంస్థగా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన జొయిటిస్ కంపెనీ అమెరికా కేం ద్రంగా పనిచేస్తుంది. అమెరికా తర్వాత జొయిటిస్ కేపబులిటీ సెంటర్ హైదరాబాద్‌లో మాత్రమే కార్యకలాపాలు ప్రారంభించింది. ముంబైలో ఇప్పటికే జొయిటిస్ పరిశోధన, అభివృద్ధి కేంద్రం నిర్వహణతోపాటు కమర్షియల్ సెంటర్ కొనసాగుతున్నప్పటికీ ఇండి యాలోని మొదటి కేపబులిటీ సెంటర్ మా త్రం హైదరాబాద్‌లోనే ఉండటం గమనార్హం. జంతువుల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యం గా వ్యాక్సిన్లు, ఔషధాల తయారీలో జొయిటిస్ కీలకంగా వ్యవహరించనున్నది.
ఈ వ్యాక్సిన్లు, మెడిసిన్ల తయారీ, ఉత్పత్తి ప్రక్రియలో టెక్నాలజీ వినియోగంపై హైదరాబా ద్‌లోని కేపబులిటీ సెంటర్ పనిచేయనున్నది. ప్రపంచవ్యాప్తంగా జంతు ఆరోగ్య సంరక్షణలో అత్యాధునిక టెక్నాలజీ వినియోగించడం ద్వారా ఈ కంపెనీ కీలకమైన అడుగు వేసింది. జొయిటిస్ కంపెనీ దాదాపు 70 సంవత్సరాలుగా జంతువుల అనారోగ్యం, రోగ నిర్ధారణ, నిరోధించే మార్గాలు, చికిత్స సంబంధిత అంశాలపై పనిచేస్తోంది. పశు వైద్యులు, పెంపుడు జంతువుల యజమానులు, రైతులకు అండగా నిలుస్తోంది. ఔషధాలతోపాటు వ్యాక్సిన్‌లు, రోగ నిర్ధారణలో కొత్త సాంకేతికత, ఆవిష్కరణలపై ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో వారి సేవలు అందిస్తోంది.
500 మందికి ఉపాధి
తెలంగాణలో కొత్త ఆవిష్కరణలకు, వ్యాపా రవృద్ధికి ఉన్న అపారమైన అవకాశాలను జొయిటిస్ వినియోగించుకునేందుకు ముం దుకొచ్చింది. జొయిటిస్ ఏర్పాటుతో హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి లైఫ్ సైన్సెస్ హబ్‌గా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ఆలోచనలకు దోహదపడటంతోపాటు వందలాది మందికి ఉద్యోగా లు లభించనున్నాయి. ఈ కంపెనీ ఏర్పాటుతో 500 మంది వరకు ఉద్యోగాలు లభిస్తాయి. 2025 కల్లా వందలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా జొయిటిస్ కార్యక లాపాలు విస్తరించనున్నది. ఫార్చూన్ 500 కంపెనీల్లో ఒకటైన జొయిటిస్ 100 దేశాల్లో అమ్మకాలు జరుపుతున్నది.
ఇక్కడ అద్భుత నైపుణ్యముంది
తెలంగాణలో అద్భుతమైన నైపుణ్యమున్న యువత అందుబాటులో ఉంది. హైదరాబాద్‌లో టెక్నాలజీ, ఫార్మా రంగాల్లో అభివృద్ధికి మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వం కూడా అనుకూలమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అందుకే గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకున్నాం. ఇప్పటివరకు ప్రభుత్వం అద్భుతమైన సహకారం అందించింది. భవిష్యత్‌లో కూడా ఈవిధంగా సహాయం అందిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. ఉద్యోగుల భర్తీని వేగవంతం చేస్తాం. సాధ్యమైనంత త్వరగా ఉపాధి కల్పిస్తాం. మా సంస్థకు సంబంధించి టెక్నాలజీ, డిజిటల్ సేవలను హైదరాబాద్‌లోని జొయిటిస్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ద్వారా అందిస్తాం.
అనిల్ రాఘవ్, జొయిటిస్ ఇండియా కేపబులిటీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్
పెంపుడు జంతువులూ కుటుంబమే
మా కార్యకలాపాల్లో హైదరాబాద్ కీలకం మెరుగైన జంతు ఆరోగ్య ఫలితాల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే మా వ్యూహా నికి ఈ విస్తరణ ఒక మైలురాయి. మా కార్యకలాపాల్లో హైదరాబాద్ కేపబులిటీ సెంటర్ కీలకంగా వ్యవహరించ నున్నది. భారతదేశంలో ఉన్న ప్రపంచస్థాయి సాంకేతిక, డిజిటల్ ప్రతిభ గల యువత, శక్తివంతమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ మాకు ఎంతో దోహద పడుతుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా పశువైద్యులు, పెంపుడు జంతు వుల యజమానులు, పాడి రైతులకు అద్భుతమైన పరిష్కారాలను అందించడంలో మా సామర్థ్యాన్ని ఇంకా మె రుగుపరుచుకొనేందుకు అవకాశం లభించింది. జంతు ఆరోగ్య పరిరక్షణలో మమ్మల్ని టెక్ లీడర్‌గా నిలి పేందుకు ఉపయోగపడే కేపబులిటీ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్ ఎం తో అనువైన ప్రాంతం. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉంది.
కీత్ సర్‌బాగ్, జొయిటిస్
చీఫ్ ఇన్మర్మేషన్ ఆఫీసర్