calender_icon.png 27 October, 2024 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈడీ కార్యాలయానికి అమోయ్ బాధితుల క్యూ

27-10-2024 12:34:45 AM

  1. 200 ఎకరాల భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు
  2. వట్టినాగులపల్లిలోని శంకర్‌హిల్స్ ప్లాట్ల యజమానుల ఫిర్యాదు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (విజయక్రాంతి): రంగారెడ్డి మాజీ కలెక్టర్ అమోయ్‌కుమార్ బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఇన్నాళ్లు పోలీస్ స్టేష న్, కోర్టుల చుట్టూ తిరిగిన బాధితులు.. ఆయనపై ఈడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు నేరుగా ఈడీ అధికారులను కలుస్తున్నారు.

అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని తట్టిఅన్నారం గ్రామానికి చెందిన పలువురు భూ బాధితులు అమోయ్‌కుమార్‌పై శుక్రవారం ఈడీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విష యం తెలిసిందే. కాగా, శనివారం వట్టినాగులపల్లిలోని శంకర్‌హిల్స్ ప్లాట్ ఓనర్స్ అసోసి యేషన్ సభ్యులు ఈడీ అధికారులను కలిసి అమోయ్‌పై ఫిర్యాదు చేశారు.

ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకొని 200 ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. తమ ప్లాట్లను ఎకరాల్లోకి మార్చి అడ్డగోలు రిజిస్ట్రేషన్లు చేశారని, రాత్రి కి రాత్రే పత్రాలు సృష్టించారని వాపోయారు. 40 ఏళ్లుగా పొజిషన్‌లో ఉన్న తమను పోలీసు బలగాలతో పంపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

సర్వే నంబర్ 111 నుంచి 179 వరకు సుమా రు 460 ఎకరాల భూమి ఉందని, శంకర్‌హిల్స్‌లో సుమారు 3,300 మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నారని, నిందితులు 200 ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని దాదాపు రూ. 30 వేల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారని, తమకు జరిగిన అన్యాయంపై ఈడీకి ఫిర్యాదు చేశామని బాధితులు వెల్లడించారు.

ఐఏఎస్ అమోయ్‌కుమార్‌తో పాటు ఇతర అధికారులు, పెద్దల పాత్రపై దర్యాప్తు జరపాలని బాధితులు ఈడీ అధికారులను కోరారు. కాగా, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండ లం నాగారంలో 42 ఎకరాల  భూదాన్ భూములను మార్కెట్ ధర కంటే చవకగా ఇతరులకు కేటాయించిన వ్యవహారంపైనే వరుసగా మూడు రోజుల పాటు అమోయ్‌కుమార్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు.. శనివారం ఎలాంటి విచారణ జరపలేదు. అయితే, సోమవారం మరోసారి అమోయ్‌కుమార్‌ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.