బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నఅంశాల ఆధారంగా ప్రశ్నలు
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 26: అసిస్టెంట్‌పై లైంగికదాడి కేసులో అరెస్ట్ అయి కోర్టు ఆదేశాల మేరకు పోలీస్ కస్టడీలో ఉన్న జానీమాస్టర్‌ను మొదటిరోజు గురువారం నార్సింగి పోలీసులు విచారించారు. కేసు సంబంధించి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారని తెలిసింది. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న ఒక్కో అంశాన్ని తీసుకుని జానీమాస్టర్‌తో పరిచయం, లైంగికదాడితో పాటు ఇతర ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అనేకసార్లు లైంగిక దాడి చేసి ఆ న్యూడ్ వీడియోలు, ఫొటోలతో ఆమెను బెదిరించిన అంశంపై విచారించినట్లు తెలు స్తోంది.
నిందితుడు కొన్ని ప్రశ్న లను దాటవేసినట్లు విశ్వ సనీ య సమాచారం. శుక్రవారం కూడా పోలీసులు ఆయన్ను విచారణ చేయనున్నారు. విచారణ నిందితుడి తరఫు న్యాయ వాది సమక్షంలో జరిగినట్లు సమాచారం. నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ భార్య ఆయేషాను సైతం పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు. బాధితురాలిపై ఆమె బెదిరింపులకు పాల్పడ్డాడరనే విషయంపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.