154. సుందర్బన్ డెల్టా ప్రాంతంలో అధికంగా ఏ నేలలు విస్తరించి ఉన్నాయి?
1. ఒండ్రు నేలలు
2. నల్లరేగడి నేలలు
3. లాటరైట్ నేలలు
4. ఎర్ర నేలలు
155. ఈ క్రింది ఏ నేలల్లో రసాయన ఎరువుల అవసరం చాలా తక్కువగా ఉంటుంది?
1. లాటరైట్ నేలలు
2. పీట్ నేలలు
3. ఎర్ర నేలలు
4. ఒండ్రు నేలలు
156. దేశంలో అవనాళికా క్రమక్షయం ఎక్కువగా గల ప్రాంతాలను గుర్తించుము?
ఎ. నర్మదా నదీలోయ ప్రాంతం
బి, చంబల్ నదీలోయ ప్రాంతం
సి. యమునా నదీలోయ ప్రాంతం
1. ఎ, బి మాత్రమే
2. బి, సి మాత్రమే
3. ఎ, సి మాత్రమే
4. ఎ, బి మరియు సి
157. పర్వత నేలలు అధికంగా దేనిని కలిగి ఉంటాయి.
1. ఇనుప మరియు అల్యూమినియం లవణాలు
2. వృద్ధిపరచని పదార్థం
3. క్లే
4. హ్యూమస్
158. లాటరైట్ నేలలు ఏర్పడటానికి కారణమైన భూస్వరూప ప్రక్రియ?
1. ఒండలి నిక్షేపణ
2. లోయస్ నిక్షేపణ
3. లీచింగ్
4. కాల్సిఫికేషన్
159. భారతదేశంలో నల్లరేగడి నేలలు ఏ వర్గానికి చెందుతాయి.
1. చెర్నోజమ్
2. లాటరైటిక్
3. టెర్రరోసా
4. పోడ్జెల్స్
160. పర్వత ప్రాంతాలలో మృత్తికా క్రమక్షయానికి గల కారణాన్ని గుర్తించుము
ఎ. పోడు వ్యవసాయం
బి. అటవీ నిర్మూలన
సి. పశువుల మేత
1. ఎ, బి మాత్రమే
2. బి, సి మాత్రమే
3. ఎ, సి మాత్రమే
4. ఎ, బి మరియు సి
161. ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఒండ్రు నేలలు అత్యల్ప స్థాయిలో విస్తరించి ఉన్నాయి?
1. పశ్చిమ బెంగాల్
2. మధ్యప్రదేశ్
3. హర్యానా
4. తమిళనాడు
162. పీట్ రకానికి చెందిన నేలలు ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి?
1. నందాదేవి
2. నంగప్రభాత్
3. మధ్యప్రదేశ్
4. కాశ్మీర్లోయ ప్రాంతం
163. ఈ క్రింది వానిని పరిశీలింపుము ప్రతిపాదన (A) : నల్లరేగడి నేలలు అనునవి ప్రతిపంటకు అనుకూలమైనవి కారణం (R): నల్లరేగడి నేలలకు నీటిని నిలువ చేసుకునే సామర్ధ్యం అధికంగా ఉన్నందున, నీటిపారుదల సౌకర్యాలు లేని వ్యవసాయ సాగు విధానాలకు ఇవి అనుకూలమైనవి
1. A మరియు R సరియైనవి,
A కి R సరియైన వివరణ
2. A మరియు R సరియైనవి,
A కి R సరియైన వివరణ కాదు
3. A సరియైనది, R సరియైనది కాదు
4. A సరియైనది కాదు R సరియైనది
164. నేలల పుట్టుక, వర్ణన, వాటి భౌతిక రసాయనిక లక్షణాలను గురించి అధ్యయనం చేయు శాస్త్ర విభాగం
1. జియాలజీ
2. పెడాలజీ
3, లిథాలజీ
4. ఎమినో పాలజీ
165. స్థానబద్ధ మృత్తికలకు ఉదాహరణ
1. లాటరైట్ మృత్తికలు
2. నల్లరేగడి మృత్తికలు
3. ఒండ్రు మృత్తికలు
4. 1, 2
166. భారతదేశంలో ఏ అంశం ఆధారంగా అడవుల వర్గీకరణ జరుగుతుంది?
ఎ. పరిపాలనా పరంగా
బి. సంరక్షణ పరంగా
సి. వర్షపాత విస్తరణ ఆధారంగా
డి. భౌతిక అంశాల ఆధారంగా
1. ఎ, బి మాత్రమే
2. బి, సి మాత్రమే
3. ఎ, బి మరియు సి
4. ఎ, బి, సి మరియు డి
167. అడవుల రకాలను ప్రభావితం చేయు అంశం/అంశాలను గుర్తించుము?
1. భూ ఉపరితలం
2. ఎత్తు
3. శీతోష్ణస్థితి
4. పైవన్నియూ
168. ఈ క్రింది వానిని జతపరుచుము వృక్షజాతి అటవీ రకము
ఎ. టేకు i. సతతహరిత
బి. యూఫోర్బియా ii ఆకురాల్చు
సి. రోజా ఉడ్ iii. సవన్న
డి. సుంద్రీ iv. మాంగ్రూవ్
1. ఎఊ-ii, బి సి డి
2. ఎ బి-ii, సి డి
3. ఎ బి సి డి
4. ఎ బి సి డి
169. ఈ క్రింది వానిలో పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో పెరిగే ముఖ్యమైన వృక్షజాతి
1. తెస్పార
2. చెస్ట్‌నట్స్
3, సాల్
4. జూనిఫర్
170. భారతదేశంలోని ఉద్బిజ సంపద క్రింది వానిలో ఏ రకానికి చెందినది?
1. గట్టి కలపనిచ్చే అడవి
2. మెత్తటి కలపనిచ్చే అడవి
3. ప్రయరీలు
4. సవన్నా
171. సుగంధ ద్రవ్యాలలో వాడే ఆల్ఫైన్ జాతి “బ్రహ్మకమలం” భారతదేశంలో ఏ ప్రాంతంలో పెరుగుతుంది?
1. గంగా మైదానం
2. తూర్పు హిమాలయాలు
3. కేరళ కొండలు
4. పశ్చిమ హిమాలయాలు
172. ఈ క్రింది వానిలో ఆయనరేఖా తేమతో కూడిన ఆకురాల్చు అరణ్యాలకు చెందని మొక్క?
1. టేకు
2. సీనమ్
3. సాల్
4. మహాగని
173. గంగా డెల్టా ప్రాంతంలోని సుందర్బన్ అడవులలో పెరిగే ప్రత్యేకమైన వృక్షజాతిని గుర్తించండి?
1. సుందరీ
2. పైన్
3. బ్లూఫైన్
4. పైవన్నియూ
174. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ (ISFR- నివేదిక ప్రకారం దేశంలోని మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణత ఎంత శాతంగా ఉంది?
1. 24.59
2. 24.62
3. 21.71
4. 21.69
175. IFSR 2019తో పోలిస్తే -ISFR 2021లో అటవీ విస్తీర్ణతలో పెరుగుదల రేటు?
1. 0.28%
2. 0.22%
3. 2.9%
4. 0.76%
176. ISFR 2019తో పోలిస్తే ISFR 2021 ప్రకారం శాతం పరంగా దేశంలో అటవీ విస్తీర్ణం/అటవీ కవచం పెరుగుదల రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రం
1. కర్ణాటక
2. ఒడిశా
3. తెలంగాణ
4. ఆంధ్రప్రదేశ్
177. భారతదేశంలో ఏ రకానికి చెందిన అడవులు ఎక్కువ విస్తీర్ణాన్నిఆక్రమించాయి?
1. ఉష్ణమండల ఆర్ధ్రతతో కూడిన సతతహరితాలు
2. ఉష్ణమండల అర్ద్రతతో కూడిన
ఆకురాల్చు అరణ్యాలు
3. ఉప ఉష్ణమండల అనార్ధ్ర సతతహరితాలు
4. తేమతో కూడిన సమశీతోష్ణమండల పర్వత ప్రాంత అరణ్యాలు
178. క్షారత్వాన్ని తట్టుకొని పెరిగే ప్రాంతాలలోని సతతహరితాలు దేశంలో క్రింద తెలిపిన ఏ ఉద్భిజ ప్రాంతంలో ఉన్నాయి
1. ఆర్ధ్ర ఆకురాల్చు అరణ్యాలు
2. అనార్ధ్ర సతతహరితాలు
3. మాంగ్రూప్స్
4. ఉష్ణమండల సతతహరిత ప్రాంతాలు
179 . సాల్ అరణ్యాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1. బీహార్
2, కర్ణాటక
3. తమిళనాడు
4. మధ్యప్రదేశ్
180. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ (ఐయూసీఎన్) భారతదేశంలో అంతరించపోయే వృక్షాల జాబితాలో చేర్చిన వృక్షం?
1. టేకు
2. జిట్టెగ
3. మంచిగంధం
4. ఎర్రచందనం
181. క్రికెట్ బ్యాట్ల తయారీకి ఉపయోగించే కలప
1. స్ప్రూప్
2. విల్లోస్
3. దేవదారు
4. సిల్వర్ ఫర్
182, ‘ఘనాపక్షి సంరక్షణ కేంద్రం’ ఎక్కడ ఉంది?
1. అరుణాచల్ ప్రదేశ్
2. రాజస్థాన్
3.. ఉత్తరాంచల్
4. గుజరాత్
183. “కన్హా జాతీయ పార్కు” ఏ రాష్ట్రంలో ఉంది?
1. ఛత్తీస్ గఢ్
2. మధ్యప్రదేశ్
3. ఉత్తరప్రదేశ్
4. జార్ఖండ్
184. పశ్చిమబెంగాల్లోని జల్దపార సంరక్షణా కేంద్రంలో పరిరక్షించబడుతున్న జంతువులు ఏవి?
1. పులలు
2. ఏనుగులు
3. ఖడ్గమృగాలు
4. అడవి గాడిదలు
185. సిగరెట్ పెట్టెల తయారీకి ఉపయోగించే కలప
1. చెస్ట్‌నట్స్
2, సిడార్
3. హాల్దా
4. సెమూల్
186.“జిమ్ కార్బెట్ జాతీయ పార్కు” ఏ రాష్ట్రంలో ఉంది?
1. అరుణాచల్ ప్రదేశ్
2. అస్సాం
3. ఉత్తరాఖండ్
4. ఉత్తరప్రదేశ్
187. ఐందీపూర్ నేషనల్ పార్కు ఎక్కడ ఉన్నది?
1. కేరళ
2. తమిళనాడు
3. కర్ణాటక
4. మహారాష్ట్ర
188, భారతదేశంలో ఆకర్షణీయ పుష్పాలు కలిగిన రెడోడెండ్రాన్ జాతికి చెందిన మొక్కలు ఏ ప్రాంతంలో పెరుగుతాయి
1. వింధ్య పర్వతాలు
2. టెరాయి మైదానం
3. లడక్
4. సిక్కిం హిమాలయాలు
189. వ్యవసాయ భూములలో పంటలతోపాటు వృక్షాల పెంపకాన్ని ప్రోత్సహించే విధానాన్ని..... అంటారు?
1. అగ్రోఫారెస్ట్రీ
2. అగ్రో ఎంకరేజ్మెంట్ ట్రీస్
3. ఆగ్రో ట్రీకవర్
4. అగ్రోస్పేస్
190. ఎండ, వేడిగాలి నుంచి రక్షించుటకు ఉపయోగించబడు చల్లని తెర (కూలింగ్ స్క్రీన్) తయారీకి ఉపయోగించు అటవీ ఉత్పత్తి?
1. పైన్
2. రూసాగడ్డి
3. వట్టివేర్లు
4. సుర్రదీ
విజేత కాంపిటీషన్స్ సౌజన్యంతో..
జవాబులు
154.1 155.4 156.2 157.4 158.3
159.1 160.4 161.2 162.2 163.1
164.2 165.4 166.4 167.4 168.1
169.4 170.1 171.4 172.4 173.1
174.3 175.2 176.3 177.2 178.3
179.4 180.4 181.2 182.2 183.2
184.3 185.3 186.3 187.3 188.4
189.1 190.3