calender_icon.png 26 December, 2024 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ బోర్డులో పరీక్షల క్వశ్చన్ బ్యాంక్ మిస్!

08-11-2024 01:18:21 AM

ఖండించిన ఇంటర్ బోర్డు 

హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): ఇంటర్ బోర్డులో క్వశ్చన్ బ్యాంక్ మిస్ అయిందనే వార్త గురువారం వైరల్‌గా మారింది. అధికారు ల నిర్లక్ష్యంతోనా? లేదంటే ఎవరైనా కావాలనే క్వశ్చన్ బ్యాంక్‌ను మిస్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రతి ఏటా మార్చిలో ఇం టర్ పరీక్షలు జరుగుతాయి. అయితే ప్రశ్నప త్రాల్లో తప్పులు దొర్లకుండా ఉండేందేకు క్వశ్చన్ బ్యాంక్ ఆధారంగానే ప్రశ్నపత్రాలను రూపొంది స్తారు.

ఆ బ్యాంక్ ఆధారంగానే ఇప్పటివరకు ఇంటర్ ప్రశ్నపత్రాలు రూపొందిస్తారని, అయితే ఇప్పుడు ఆ బ్యాంక్ మిస్ కావడంతో ప్రశ్నపత్రం తయా రు చేసే వారికే ప్రశ్నలు ఫ్రేమ్ చేయాలని అధికారులు చెప్పినట్లు వార్త చక్కర్లు కొట్టింది. దీంతో ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్త మయ్యాయి. దీనిపై స్పందించిన బోర్డు అధికారులు గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఇంటర్ బోర్డు క్వశ్చన్ బ్యాంక్ మిస్ కావడమనే వార్త అవాస్తవమని, దాన్ని ఖండిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్వశ్చన్ బ్యాంక్ మిస్ అయిం దనే వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేసి, భయాందోళనలు సృష్టిస్తున్న వారిపై కేసు నమోదు చేస్తా మని ఇంటర్మీడియట్ ఆర్జేడీ జయప్రద బాయి ఈమేరకు ఒక ప్రకటనలో తెలిపారు.