calender_icon.png 2 April, 2025 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాటసారుల దాహం తీర్చండి

01-04-2025 02:04:48 AM

-సిఎల్‌ఆర్ చలివేంద్రాన్ని ప్రారంభించిన మాజీమంత్రి డాక్టర్ సీలక్ష్మారెడ్డి 

మహబూబ్ నగర్ మార్చి 31 (విజయ క్రాంతి) : వేసవి కాలంలో బాటసారులకు దాహం తీర్చేందుకు దాతలు ముందుకు రావాలని మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్ల సమీపంలోని మాచారం గ్రామంలో ఏర్పాటు చేసిన సీఎల్‌ఆర్ చలివేంద్రాన్ని, ఎన్ హెచ్ 44 దగ్గర విహార్ హోటల్ మాజీ మంత్రి సీ.లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ తోటి వారికి సహా యం చేసేలా ప్రతి ఒక్కరు ముందు ఉండాలని, అప్పుడే ఆ భగవంతుడు వారిని క్షేమం గా చూస్తారని తెలిపారు, దాతలు ముందు కు వచ్చి నియోజకవర్గ వ్యాప్తంగా మరిన్ని చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, తదితరులు ఉన్నారు.