మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలో విధులు నిర్వహిస్తున్న సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్లు కేటాయింపు కోసం ఏరియా అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. సింగరేణి ఉద్యోగులకు సీఈఆర్ క్లబ్ లో శుక్రవారం క్వాటర్స్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా కౌన్సిలింగ్ కు మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలకు 99 క్వాటర్స్ గాను 130 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని కౌన్సెలింగ్ పూర్తి పారదర్శకంగా చేపట్టినట్లు ఏరియా పిఎం శ్యామ్ సుందర్ తెలిపారు. సీనియార్టీ ప్రకారం 29 మంది ఎన్.సి. డబ్ల్యూ.ఎ మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియా ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం విజయ్ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, డీజీఎం ఐఇడి రాజన్న, డివైపిఎం మైత్రేయ బంధు, రాజలింగు (ఒ.ఎస్) పాల్గొన్నారు.