calender_icon.png 21 December, 2024 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం

15-10-2024 12:02:22 AM

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం 

కామారెడ్డి, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం నస్రూల్లాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే బాన్సువాడ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్‌రాజు, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.