16-04-2025 12:16:49 AM
హయత్‌నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్‌రెడ్డి
ఎల్బీనగర్, ఏప్రిల్ 15 : సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్ ను కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి కోరారు. హయత్ నగర్ డివిజన్ లోని మహాగాయత్రీ నగర్ లో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీ రోడ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లు నాణ్య తా ప్రమాణాలు పాటించే విధంగా ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షించాలన్నారు.
భవిష్యత్‌లో కాలనీవాసులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీసీ రోడ్ల నిర్మా ణం చేపట్టాలని సూచించారు. కార్యక్రమం లో బీజేపీ మల్కాజిగిరి పార్లిమెంట్ జా యింట్ కన్వీనర్ బండారి భాస్కర్, డీఈ దా మోదర్, ఏఈ హేము నాయక్, వర్క్ ఇన్స్ స్పెక్టర్ సురేశ్, మహా గాయత్రి కాలనీ అధ్యక్షుడు దేవ్ సింగ్, ప్రధాన కార్యదర్శి మలిగ లింగం, సంక్షేమ సంఘం సభ్యులు భగవత్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, బలరాం రెడ్డి, ప్రవీణ్, వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.