calender_icon.png 26 December, 2024 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి కోతల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

07-11-2024 05:04:19 PM

చెన్నూరు ఏడీఏ బానోత్ ప్రసాద్

మందమర్రి (విజయక్రాంతి): రైతులు వరి కోతల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తద్వార తాలు, తప్ప లేని నాణ్యమైన ధాన్యం పొందవచ్చని వ్యవసాయ శాఖ చెన్నూర్ ఎడిఎ బానోత్ ప్రసాద్ అన్నారు. గురువారం మండలంలోని సారంగపల్లి గ్రామంలోని పొలాల్లో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వరి కోతల కోసం వినియోగించే హార్వెస్టర్ యంత్రంలో ఫ్యాన్ వేగం 18 ఆర్పీయం ఉండేలా చూసుకోవాలని తద్వార నాణ్యమైన ధాన్యం దిగుబడి వస్తుందని వరి సరిగా ఎండినతరువాతనే కోతలు చేపట్టాలని, అనంతరం ధాన్యంలో 14 నుంచి 17 శాతం కి మించకుండా చూసుకోవాలని సూచించారు. అంతే కాకుండా పత్తిలో తేమ 8 నుండి12 శాతం మాత్రమే ఉండాలని, ఎక్కువ తేమ ఉన్న యెడల పట్టాలపై పత్తిని సరైన తేమ శాతం వచ్చువరకు ఆరబెట్టాలని సూచించారు.

తేమ శాతం ఎంత తక్కువగా ఉంటే అంత మద్దతు ధరలో పెరుగుతుందని సూచించారు. వరి సన్న రకాలకు రూ.500 బోనస్ పై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలోని రైతు గౌస్ సాగు చేసిన శ్రీరామ సీడ్స్ వారి ఉష వరి రకాన్ని పరిశీలించి, పంట బాగుందని, గొలక, గింజలు బాగుండి, తాటాకు తెగులు తట్టుకుంటుంది అని, చౌడు భూముల్లో కూడా బాగా వచ్చిందన్నారు. ఆయన వెంట ఏఈఓ ముత్యం తిరుపతి, శ్రీ రామ సీడ్స్ ఆర్.ఎం. మహేందర్ రెడ్డి, సేల్స్ ఇంచార్జ్ మహేందర్, రమేష్, రైతులు పాల్గొన్నారు.