calender_icon.png 7 January, 2025 | 3:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యతా ప్రమాణాలే కీలకం

11-09-2024 12:00:00 AM

ఆతి పాతికానాం పణ్యానా 

మన్యత్రా విక్రేయ మిత్యవరోధేనా 

సుశయోఃదేయః తస్యాతిక్రమేణే 

చతుర్వింశతిపణో దండః 

పణ్యదశ భాగోవా

 కౌటిలీయం (అర్థ శాస్త్రం, 

ఆచార్య చాణక్య-: 3-15)

అర్థశాస్త్రం మూడవ అధికరణంలో క్రయవిక్రయాలలో నాణ్యతా ప్రమాణాలను పా టించే విధివిధానాలను గురించి చెప్పారు ఆచార్య చాణక్య. పరస్పర ఆధారిత సమాజంలో అందరూ అన్ని వస్తువులు తయారు చేసుకోలేరు. కాబట్టి, వస్తు మార్పిడి తప్పనిసరి. దానికి వివిధ ప్రామాణికాలతో క్రయ విక్రయాలను (కొనడం, అమ్మడం) సాగించడం అనాదిగా వస్తున్న అంశం. క్రయ విక్రయ సంబంధిత ఒప్పందాలు చేసుకోవడం, చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసు కోవడం గురించి చర్చించారు చాణక్య.

అవసరాలనుబట్టి, వినియోగాన్నిబట్టి, ల భ్యతనుబట్టి అంగడిలో వస్తువు విలువ పెరగడం లేదా తగ్గడం జరగవచ్చు. ఏ రం గం లోనైనా వస్తువు నాణ్యతా ప్రమాణాలకు అ నుగుణంగా ధరలు నిర్ణయమవుతాయి. వినియోగదారులకు తమ ఆర్థిక స్తోమతనుబట్టి, అవసరాల మేరకు నచ్చిన వస్తువును కొనుగోలు చేసే స్వేఛ్ఛ ఉంటుంది. అయితే, ఆహా రం, మందులకు సంబంధించిన వస్తువుల క్రయవిక్రయాలలో నాణ్యతా ప్రమా ణాలను పూర్తిగా పాటించకపోతే వినియోగదారులకు ప్రాణాపాయ ప్రమాదం ఏర్పడుతుంది.

ఎక్కువ రోజులు నిలువ ఉండని వస్తువుల విషయంలో, కొనుగోలుదారు కొన్న వెంటనే అమ్మకందారు వస్తువులను అందించాలి. అయితే, ఆ వస్తువులను అమ్మకందారు మరొకరికి అమ్మకూడదనే షరతుపై అమ్మిన సరకును కొనుగోలుదారుకు తెల్లవారి ఇచ్చేందుకు అనుమతించబడింది. అమ్మకందారు నాణ్యతా ప్రమాణాలను పాటించకపోయినా, చెప్పిన సమయానికి సరకును అందించకపోయినా అతను ఇరవైనాలుగు పణాలు గాని, వస్తువు విలువలో పదవ వంతుగానీ రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. (ఆనాటి పణ ము ఈనాటి రూపాయి లాంటిది).

ఆ వస్తువులను చెడిపోక ముందు, నిర్దిష్టమైన కాలా వధిలో వినియోగించే విధానాన్ని అమలు చే స్తూ, ప్రభుత్వాలు వాటి నాణ్యతను పర్యవేక్షించేందుకు స్పష్టమైన విధానాలను అమలు చేయాలి. అలాగే, ఒప్పందం చేసుకొని సరకును కొన్న పిమ్మట దానిని తీసుకొనని కొనుగోలుదారుకు పన్నెండు పణాల దండన విధించవచ్చు. అయితే, ఆ సరకులో దోషాలు ఉన్నా, అనుకోని ఆపదలు సంభవించినా ఆ రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు. అదే విధంగా, చాలా కష్టాలలో ఉన్న వ్యక్తి అత్యంత ఖరీదైన వస్తువును చాలా తక్కువ ధరకు అమ్మినా ఒప్పందం అంగీకారయోగ్యం కానిదిగా భావించాలి. 

తక్కువ ధర - ఎక్కువ నాణ్యత

వ్యక్తులు తమతమ ఆర్థిక పరిస్థితులు, అవసరాలు ప్రాతిపదికగా తాము వినియోగించే వస్తువులను వివిధ నాణ్యతా ప్రమాణాలతో కొనుగోలు చేస్తారు.  కొనుగోలుదారు ప్రయోజనాలు ప్రాతిపదికగా ప్రభుత్వం ప్రతి వస్తువు తయారీకి నిర్దిష్టమైన కనీస నాణ్యతా ప్రమాణాలు నిర్ణయిస్తుంది. ఉత్పత్తిదారు ఆయా ప్రమాణాలకు అనుగుణంగా వస్తువులను ఉత్పత్తి చేసి అమ్మకాలు సాగించాలి. ప్రతి ఉత్పత్తిదారు తన సంస్థలో ఉత్పత్తి చేసే ప్రతి వస్తువునూ నాణ్యతా పరీక్షలు చేసి వస్తువు నాణ్యతను తెలిపే ఒక యోగ్యతా పత్రాన్ని లేదా హామీ పత్రాన్ని జత చేయాలి.

నాణ్యత అనేది నిరంతరం అభివృద్ధి చే యవలసిన అంశం. తక్కువ ధరకు అత్యంత నాణ్యమైన వస్తువును అందించగలిగిన సంస్థ ఉత్పత్తులను వినియోగదారులు అనుమోదిస్తారు, ఆదరిస్తారు. ఈనాడు అంతర్జాతీ యం గా వస్తు వినిమయం పెరిగిపోయింది. వినియోగదారుని సంతృప్తి లక్ష్యంగా అన్ని సంస్థ లూ నాణ్యతా ప్రమాణాలను నిరంతరం మె రుగు పరచుకోవడం జరుగుతు న్నది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తమ ఉత్పత్తుల నాణ్యతను సరిచేసుకుంటూ ఐఎస్‌వో  (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాం డర్డుజేషన్) నుండి యోగ్యతా ప్రమాణ పత్రాలను పొందే సంస్థలే నిలదొక్కుకుంటాయి. సంస్థలు ఈ విధానంలో వినియోగదారుని అభిప్రాయాలకు అనుగుణంగా తమ ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలను ఉన్నతీకరించు కోవడం జరుగుతున్నది. 

 పాలకుర్తి రామమూర్తి