మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, నవంబర్ 24 (విజయక్రాంతి): రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్లకు, అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఆదివారం ఖమ్మంలోని 15వ డివిజన్‌లో పర్యటించి వెలుగుమట్ల అర్బన్ పార్క్ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. అర్బన్ పార్క్‌కు డబుల్ రోడ్డు నిర్మాణం నాణ్యతతో ఉగాది నాటికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు పూర్తి స్థాయిలో పరిష్కరించి వారి నుంచి ఫీజులు వసూలు చేయాలని, మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చాలని మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, మేయర్ నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య, కార్పొరేటర్ రావూరి కరుణ పాల్గొన్నారు.