calender_icon.png 21 January, 2025 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి

05-07-2024 12:25:32 AM

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ 

ముషీరాబాద్, జూలై 4: అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని ముషీరాబా ద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో జాప్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని సూచించారు. గురువారం నియోజకవర్గంలోని కవాడిగూడ డివిజన్ మోతీలాల్ నెహ్రూ నగర్‌లో రూ. 6.50 లక్షల వ్యయంతో డ్రైనేజీ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ గోడ్చల రచనశ్రీతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముషీరాబాద్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ముఠా జైసింహ, కవాడిగూడ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎన్‌డీ సాయికృష్ణ, రాంచందర్, రాజేశ్, మధు, రవి యాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకులు వెంకటేశ్, మహేందర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.