జయశంకర్ వ్యవసాయ వర్సిటీ
హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాం తి): వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామంలో ఐదు నుంచి పదిమంది అభ్యుదయ రైతులకు నాణ్యమైన విత్తనాల ను సరఫరా చేయాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలి నిర్ణయించింది. బుధవారం పాలకమండలి వీసీ ప్రొఫెసర్ జానయ్య అధ్యక్షతన సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.
రాజేంద్రనగర్‌లోని వ్యవ సాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనం లో ఈ మీటింగ్ జరిగింది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నూతనంగా విత్తన విభాగం ఏర్పాటు చేసి దానికి ఒక సంచాలకుడి స్థాయి అధికారిని నియమించాలని సమావేశంలో నిర్ణయించారు.
విత్తన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని, ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం నుంచి నిధుల కోసం రాష్ర్ట ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని పాలకమండలిలో తీర్మానించా రు. మరికొన్ని నిర్ణయాలు ఇవీ..
* పూర్తిస్థాయి అధికారుల నియామకం.
* వ్యవసాయ విద్యకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఇటీవల పెంచిన ప్రత్యేక కోట సీట్లకు ఫీజు తగ్గింపు
* విభాగాధిపతుల పదవీకాలాన్ని మూడేళ్లుగా నిర్ణయిస్తూ.. ప్రతీ మూడేళ్లకోసారి రొటేషన్ పద్ధతిలో, సీనియార్టీ ఆధారంగా విభాగధిపతుల నియామకం
* కళాశాలల్లో అసోసియేట్ డీన్ల నియామకం, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ పోస్టులను సీనియార్టీ ప్రాతిపదికన భర్తీ చేయడం, తొలుత పదవీకాలాన్ని రెండే ళ్లపాటు కొనసాగించడం, తర్వాత మరో రెండేళ్లు పొడిగించే వెసులుబాటు.
* యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా జాతీయ, అంతర్జాతీయ అనుభవం కలిగిన ప్రముఖ వ్యవసాయ శాస్త్ర నిపుణులను ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్‌గా ఏడాది కాలపరిమితితో నియమించుకోవడం. అవసరమైతే వారిని మూడేళ్ల వరకు నియమించుకునే వెసులుబాటు.
* 7, 8 ఏండ్లుగా విశ్వవిద్యాలయ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లులను నాలుగు దఫాలుగా చెల్లింపుఉద్యోగులు, పెన్షనర్లకు ఐదేళ్లుగా నిలిపేసిన వర్సిటీ ఆరోగ్య కేంద్ర సేవలను పునరు ద్ధరిస్తూ పాలకమండలి ఆమోదముద్ర.
* ఈ డిసెంబర్‌లో ప్రభుత్వం, రైతుల భాగస్వామ్యంతో వజ్రోత్సవాలు.