calender_icon.png 28 March, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన రోడ్లను నిర్మించాలి

21-03-2025 12:52:50 PM

 మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్           

నిజాంసాగర్,(విజయక్రాంతి): సిసి రోడ్డు పనులను నాణ్యతతో చేపట్టాలని పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్(Pitlam Market Committee Chairman Chikoti Manoj Kumar) అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని తుంకిపల్లి గ్రామంలో, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు పనులను ప్రారంభించారు. జుక్కల్ ఎమ్మెల్యే  తోట లక్ష్మికాంతారావు కృషి తో గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో మమ్మద్ నగర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి,  మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుమ్మరి రాములు, కమ్మరి కృష్ణ, రసీదు, భక్తి సాయిలు, సిద్ధపల్లి శంకర్  తదితరులు పాల్గొన్నారు.