calender_icon.png 20 April, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి పేదవారి ఇంటికి నాణ్యమైన సన్నబియ్యం

03-04-2025 12:47:10 AM

  • అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి 
  • జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి 

గద్వాల, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన సన్నరకం బియ్యాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి లు సూచించారు.

బుధవారం గద్వాల్ కేంద్రంలోని 35వ,26వ వార్డుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గద్వాల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించి, లబ్ధిదారులకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేశారు.

ఈ సం దర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం పేదల ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు, ఉగాది పండుగ కానుకగా నాణ్యమైన సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసే ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. జిల్లాలోని మొత్తం 335 రేషన్ షాపుల ద్వారా 1,62,000కి పైగా రేషన్ కార్డుదారులకు,మొత్తం 5,50,000 మందికి పైగా లబ్ధిదారులకు ఉచితంగా సన్న బియ్యం అందజేయబడుతుందని తెలిపారు.

ప్రతి ఒక్క లబ్ధిదారికి నెలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఈ సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పేదలకు బియ్యం పంపిణీ ... గద్వాల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గతంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు పేదల ఆకలిని తీర్చాలని సంకల్పించి రెండు రూపా యలకే బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారని,అప్పటి నుంచి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పేదలకు బియ్యం పంపిణీ కొనసాగిస్తూ వచ్చిందని గద్వాల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా,రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసి,బి య్యంగా మార్పిడి చేసి,రేషన్ షాపుల ద్వారా పూర్తిగా ఉచితంగా పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు. మార్కెట్లో కిలో రూ.40 విలువైన సన్న బియ్యాన్ని పేదలకు ఉచితంగా అందించడం ప్రభుత్వ సంకల్ప బలానికి నిదర్శనమని తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న.

ఈ బియ్యాన్ని బ్లాక్ మార్కె ట్కు అమ్మకుండా,కేవలం తమ అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు.ప్రతి అర్హత గల లబ్ధిదారు లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. త్వరలోనే ప్రజలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ,గద్వాల తహసీల్దార్ మల్లికార్జున్, డిసిఎ స్‌ఓ స్వామి కుమార్, రేషన్ డీలర్లు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.