రామగుండం, ఎన్టిపిసి జడ్పీహెచ్ఎస్ పాఠశాల తనిఖీలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
రామగుండం (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదివి పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం ఎన్టిపిసి లోనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్వహించిన సైన్స్ ఫెయిర్ లో కలెక్టర్ పాల్గొన్నారు. సైన్స్ ఫెయిర్ లో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను కలెక్టర్ ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సైన్స్ ఫెయిర్ లో ఆసక్తిగా పాల్గొన్న విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలకు విద్యార్థులకు మధ్యాహ్నం నాణ్యమైన ఆహారం భోజనంగా అందించాలని, ఎటువంటి పొరపాట్లు జరగడానికి వెళ్లలేదని అధికారులకు సూచించారు. పాఠశాలల్లో విద్యతో పాటు విద్యార్థులకు అవసరమైన వినోదం ఉండాలని, సైన్స్ ఫెయిర్ నిర్వహణ, పర్యాటక ప్రాంతాల చదవాల్సిన వంటి కార్యక్రమాలను ప్లాన్ చేయడం చాలా మంచిదని, అనంతరం రామగుండంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్, విద్యార్థులకు అందుతున్న ఆహారాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, జిల్లా సైన్స్ అధికారి రఘునందన్ రావు, మండల విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.