calender_icon.png 16 January, 2025 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు నాణ్యమైన వైద్య సేవలందించాలి

12-07-2024 12:03:50 AM

మంత్రి దామోదర రాజనర్సింహ

కూకట్‌పల్లి, జూలై 11: పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రైవేట్ ఆసుపత్రులు కృషి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సిం హ అన్నారు. గురువారం కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డులు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంకుర ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యేలు, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.