11-02-2025 10:59:13 PM
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,బాలికల వసతిగృహం తనిఖీ..
శిథిల వ్యవస్థలో ఉన్న హాస్పిటల్ ను వేరే ప్రాంతానికి తరలించాలి..
నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి..
మునుగోడు (విజయక్రాంతి): ప్రజలకు మరింత చేరువగా నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం అందించే ఆరోగ్య సేవలను, మాత, శిశు సంరక్షణ సేవలు, కుటుంబ నియంత్రణ, సాధారణ ప్రసవాల పట్ల అవగాహన పెంచుతూ, ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలను పెంచాలని నల్గొండ జిల్లా కలెక్టర్ యీల త్రిపాటి వైద్యాధీకారిని ఆదేశించారు. శిథిల వ్యవస్థలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని వేరే ప్రాంతానికి తరలించారని సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం చండూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె స్థానికంగా తనిఖీ చేసి దస్త్రాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలు, గదులు, హాస్పిటల్ లో ఉన్న ల్యాబ్ ను, ఓ పి రిజిస్టర్ ను పరిశీలించి, ప్రతి రోజు ఎంతమంది పేషెంట్లు ఆస్పత్రికి వస్తున్నారని సంబంధిత మెడికల్ అదికారి డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు.
ఎక్కువగా ఏఏ పేషెంట్లు వస్తున్నారని కలెక్టర్ అడగగా, జలుబు, దగ్గు వచ్చిన వారు వస్తున్నారని మెడికల్ ఆఫీసర్ తెలిపారు మందుల స్టాక్ గురించి అడిగి తెలుసుకున్నారు. మందుల కొరత లేకుండా చూడాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ఆసుపత్రిలో ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయని ఆరా తీశారు. హాస్పటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. 2023 సంవత్సరం కన్నా ముందు ఉన్న మందులను రోగులకు ఇవ్వవద్దు అని సూచించారు. హాస్పిటల్ శిథిలా వ్యవస్థలో ఉన్న గోడలను పరిశీలించారు. అనంతరం బాలికల వసతి గృహానికి వెళ్లి తనిఖీ చేశారు. ఆమె వెంట ఆర్డిఓ శ్రీదేవి, తాసిల్దార్ దశరథ, డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు.