calender_icon.png 29 March, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన వైద్యసేవలు అందించాలి

24-03-2025 01:06:17 AM

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

ఎల్బీనగర్, మార్చి 23: దవాఖానల్లో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచించారు. వనస్థలిపురంలోని ఎఫ్ సీఐ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ రిహాబిలిటేషన్ సెంటర్ (హాస్పిటల్)  ఆదివారం మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ మాజీ కార్యదర్శి, వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి, మదర్ డైయిరీ మాజీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి, జీహెచ్‌ఎంసీ మాజీ కో- ఆప్షన్ మెంబర్ మల్లారపు శాలిని, హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నేలపాటి రామారావు, సత్యనారాయణ, పాశం అశోక్ గౌడ్, కాంగ్రెస్ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు కుట్ల నర్సింహా యాదవ్, నాయకులు ఎన్ వీ రమణారావు, బత్తుల మల్లేశ్ గౌడ్, బాలు నాయక్, గౌరీ, ప్రమీల, కిశోర్, శ్రీధర్, కిరణ్ గౌడ్, జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.