చాణక్యుడు భారతదేశపు గొప్ప తత్వవేత్త. అర్థశాస్త్రం ద్వారా ఆర్థిక వ్యవహారాలపై అనేక సూత్రాలను చెప్పారు. వాటిలో ఒక ముఖ్యమైన పాఠం, నాణ్యత తగ్గించకుండా సరైన ధరకు వస్తువులను అమ్మడం. ఈ సిద్ధాంతం, ప్రస్తుత ప్రపంచంలో కూడా, ముఖ్యంగా వ్యాపారాలు, వినియోగదారులు ఎదుర్కొనే సవాళ్లలో చాలా ముఖ్యమైనది.
చాణక్యుడు చెప్పినట్లుగా, వస్తువులను తక్కువ ధరలో కొనడమే కాదు, మంచి నాణ్యతకూ ప్రాధాన్యత ఇవ్వాలి. అతి తక్కు వ ధరకు కొనడం వల్ల నాణ్యత తగ్గితే, దీర్ఘకాలంలో నష్టపరుస్తుంది. ఈ సూత్రం ఆధు నిక ఆర్థిక వ్యవహారాల్లోనూ అనేక రంగాల్లో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రిటైల్, వినియోగదార వస్తువుల రంగాలలో ఇది చాలాముఖ్యం.
ప్రస్తుత గ్లోబల్ మార్కెట్లో కంపెనీలు తమ ధరలను తగ్గిస్తూ, కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ధరల పోటీ క్రమంలో, నాణ్యతను కాపాడటమే అతి పెద్ద సవాలు. ఉదాహరణకు, మన దేశంలోని డీమార్ట్, రిలయన్స్ వంటి రిటైల్ దిగ్గజాలు తక్కువ ధరలకు మంచి నాణ్యతతో కూడిన ఉత్పత్తులను అందించడంలో సఫలీకృతమయ్యాయి.
భారతదేశంలో వినియోగదారులు తక్కువ ధరలకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తు న్న వినియోగదారులు కూడా పెరుగుతున్నారు. ప్రత్యేకంగా, ఎలక్ట్రానిక్స్, వాహనా లు, ఆహార ఉత్పత్తులువంటి రంగాలలో, నాణ్యమైన ప్రీమియం ఉత్పత్తులను కొనడానికి సిద్ధంగా ఉన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆపిల్ వంటి కంపెనీలు అధిక ధరలకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ, వినియోగదారుల విశ్వాసాన్ని పొందాయి. మరో వైపు, షియోమి వంటి కంపెనీలు తక్కువ ధరలకు అధునాతన సాంకేతికతను అంది స్తూ గ్లోబల్ మార్కెట్లో ముఖ్యమైన స్థానాన్ని పొందాయి.
చాణక్యుడు పన్నుల విషయంలో ప్రజల పై అధికంగా బరువు వేయకూడదని, పన్ను లు సక్రమంగా ఉండాలని చెప్పారు. భారతదేశంలో జీఎస్టీద్వారా పన్ను విధానం సరళీకరించి, వ్యాపారులు , వినియోగదారులకు ఉపయోగపడేలా ప్రయత్నించారు. ప్రపంచం ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో సరైన ధర, నాణ్యతను కాపాడటం వ్యాపారాలకు కీలకం.
భారతదేశంలో రిటైల్ రంగం ద్రవ్యోల్బణం వల్ల ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ, పలు సంస్థలు సరఫరా శ్రేణులను మెరుగుపరిచి ధరలను నియంత్రించడం ద్వారా కస్టమర్లకు నాణ్యమైన వస్తువులను అందించేందుకు కృషి చేస్తున్నాయి. చాణక్యుడు చెప్పిన ఈ ఆర్థిక పాఠం నేటి వ్యాపార ప్రపంచంలో కూడా ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంది. వ్యాపారులు తక్కువ ధరలకు కూడా నాణ్యమైన ఉత్పత్తులను అందించడం ద్వారా విని యోగదారుల విశ్వాసాన్ని గెలుచుకోవచ్చు.
డా. చిట్యాల రవీందర్