calender_icon.png 29 October, 2024 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీ-సాట్ ద్వారా నాణ్యమైన ఉన్నత విద్య

29-10-2024 01:01:54 AM

ఉన్నత విద్యా మండలి చైర్మన్ వీ బాలకిష్టారెడ్డి

హైదరాబాద్/సిటీబ్యూరో, అక్టోబర్ 28 (విజయక్రాంతి): తెలంగాణలోని ప్రతిఇంటికీ టీ-సాట్ ద్వారా నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని టీ కార్యాలయాన్ని ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఈ పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌తో కలిసి సోమవారం సందర్శించారు.

టీ-సాట్ పనితీరు, ప్రాథమిక, ఇంటర్మీడియెట్, పోటీ పరీక్షలు, ఇతర విభాగాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో బాలకిష్టారెడ్డి బృందానికి టీ-సాట్ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి వివరించారు. ఉన్నతవిద్యలో భాగమైన విశ్వవిద్యాలయాలు, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కళాశాలలకు సంబంధించి టీ-సాట్ వేదికను ఉపయోగించు కోవాలని కోరారు.

భవిష్యత్‌లో నాణ్యమైన డిజిటల్ కంటెంట్‌ను ఉన్నత విద్యనభ్యసించే వారికి అందించేలా ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసుకుందామని, ఉన్నత విద్యామండలి విడుదల చేసే పరీక్షా ఫలితాలను టీ-సాట్ వెబ్‌సైట్ ద్వారా విడుదల చేయాలని వేణుగోపాల్‌రెడ్డి కోరగా బాలకిష్టారెడ్డి సానుకూలం వ్యక్తం చేశారు.

ఈ సందర్భం గా బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. ఉన్నత విద్యామండలి 52 మాడ్యుల్స్‌లో ఉన్నతవిద్యకు సంబంధించిన కంటెంట్ అందుబాటులోకి తెచ్చేలా సిద్ధం చేస్తున్నామని గుర్తు చేశా రు. తెలంగాణ ప్రభుత్వం తమపై ఉంచిన బాధ్యతలకు అనుగుణంగా విద్యారంగాన్ని పటిష్టం చేస్తామని, ఆ ప్రక్రియలో భాగంగా టీ-సాట్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. 

విజ్ఞాన విప్లవం ప్రపంచాన్ని శాసిస్తోంది

విజ్ఞాన విప్లవం ప్రపంచాన్ని శాసిస్తోందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. ‘ఆధునిక మేధో విజ్ఞానం-భారతీయ జ్ఞాన వ్యవస్థ మూలా లు, పునరుద్ధరణ’ అనే అంశంపై ఉస్మానియా వర్సిటీ దూరవిద్యాకేంద్రం ఆడిటోరి యంలో జరిగిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా కిష్టారెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక, సాంకేతిక, విజ్ఞాన అభివృద్ధికి 21వ శతాబ్దం కేంద్రంగా నిలిచిందన్నారు. భారతీయ మూలాల్లోనే సాంకేతికత అనే పదం ఉందని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఏబీఆర్‌ఎస్‌ఎం ప్రధాన కార్యదర్శి గుంతా లక్ష్మణ్‌జీ, వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తి, వీడీయూఎస్‌ఎస్ ఉపాధ్యక్షుడు మురళీమనోహర్‌తో పాటు  తదితరులు పాల్గొన్నారు.