calender_icon.png 29 November, 2024 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి

29-11-2024 04:45:44 PM

తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ను ఆకస్మికంగా తనిఖీ 

జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్..

గద్వాల (విజయక్రాంతి): విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ గద్వాల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి, మధ్యాహ్న భోజన నిర్వహణను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు రోజు వడ్డిస్తున్న భోజనం, వంట సామాగ్రి, కిచెన్ షెడ్, స్టాకు గదులు, స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన బియ్యం, గుడ్లు, కూరగాయలు, పప్పు బియ్యంలను ఇతర సరుకుల నాణ్యతను, వాటి కాలపరిమితిని పరిశీలించారు. మెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనం అందజేస్తున్నారా? లేదా? ఈ రోజు మెనూ ప్రకారం ఏం చేశారని వంట సిబ్బందిని ఆరా తీశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం వడ్డించాలన్నారు.

తాజా కూరగాయలు, నాణ్యత గల సరుకులను మాత్రమే వంటకు వినియోగించాలని సూచించారు. వంటశాల ప్రదేశం, వంట పాత్రలు ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. నాసిరకమైన బియ్యం, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలు సరఫరా చేసినట్లయితే తీసుకోవద్దనారు. ప్రతిరోజూ ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించాలని మెస్ కమిటీ సభ్యులకు తెలిపారు. భోజన నాణ్యతలో నిర్లక్ష్యం చేయొద్దని ఉపాధ్యాయులకు, వంట వారికి సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి భోజనం ఎలా ఉంటోంది, మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సి.ఈ.ఓ కాంతమ్మ, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ భవానీ, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.