calender_icon.png 13 January, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాల్లో క్వాలిటీ ఫుడ్ పెట్టాలి

06-12-2024 11:33:31 PM

స్టూడెంట్స్ కు మెనూ ప్రకారం భోజనం పెట్టకపోతే చర్యలు తీసుకుంటాం

సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి

కోహెడలో టీఎస్ డబ్ల్యూ ఆర్ జేసీలో ఆకస్మిక తనిఖీ

హుస్నాబాద్ (విజయక్రాంతి): గురుకులాల్లో స్టూడెంట్స్ కు క్వాలిటీ ఫుడ్ పెట్టడంతోపాటు మెనూ ప్రకారం అందించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన కోహెడలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా కిచెన్ షెడ్ లోకి వెళ్లి కూరగాయలను పరిశీలించారు. స్టోర్ రూంలో బియ్యం, పప్పులు, వంటనూనెను పరిశీలించారు. కాలం చెల్లిన సరుకులు వాడవద్దన్నారు. నాణ్యతలో ఎలాంటి రాజీ పడొద్దన్నారు. విద్యార్థులకు రుచికరమైన వంటలు మెనూ ప్రకారం అందించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 575 మంది విద్యార్థులు ఉన్నారని, మంచినీటి ఇబ్బందితో పాటు బాత్రూమ్ లు రిపేర్ చేయాల్సి ఉందని, డ్రెయినేజీలు సరిగా లేవని ప్రిన్సిపాల్ వెంకటరాంరెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ఆయన వెంట తహసీల్దార్ సురేఖ తదితరులున్నారు.