జహీరాబాద్ ఆర్డిఓ రామ్ రెడ్డి
జహీరాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నిర్లక్ష్యం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని జహీరాబాద్ ఆర్డీవో రాంరెడ్డి హెచ్చరించారు. జహీరాబాద్ పట్టణంలోని ఎస్సీ కళాశాల బాలుర వసతిగృహం ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి వసతి గృహ పరిసరాలను, వంటగదిని, సామాగ్రి గదిని, మరుగుదొడ్లను పరిశీలించినారు. సామాగ్రి గది యందు విద్యార్థులకు అందజేస్తున్న భోజన సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు అందజేస్తున్న అన్నం పప్పు కూరగాయలు గుడ్లు, మజ్జిగ యొక్క నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులు పండుకునే గదులను పరిశీలించారు.
విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వసతి గృహం యందు వర్షాకాలంలో రూప్ లీకేజ్ గురించి విద్యార్థులు తెలియజేయడం జరిగింది. వసతి గృహం భవనం మరమ్మతులు చేసినందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశిస్తానని తెలిపారు. విద్యార్థులకు ప్రతి నెల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేయాలని ఆదేశించారు. వసతి గృహంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చలికాలంలో విద్యార్థులకు వేడి నీళ్లు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వసతి గృహం అధికారి కృష్ణ వంశీ, అధికారులు ఉన్నారు.