21-02-2025 12:42:07 AM
గద్వాల, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ బి. యం సంతోష్ అధికారులకు ఆదేశించారు. గురువారం గట్టు మండలంలోని తెలంగా ణ సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, మధ్యాహ్న భోజన నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించా రు. మెనూ ప్రకారం భోజనం అందుతున్న దా, రుచి ఎలా ఉన్నదాని విద్యార్థులతో మా ట్లాడి వివరంగా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు రోజు వడ్డిస్తున్న భోజనం,వంట సామాగ్రి, కిచెన్ షెడ్, స్టాకు గదులు,స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన బియ్యం,రాగి, పప్పులు, షుగర్ ,బెల్లం,ఇతర సరుకుల నాణ్యతను,వాటి కాలపరిమితిని పరిశీలించారు. విద్యార్థులకు మె నూ ప్రకారం భోజనం అందజేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ రోజు మెనూ ప్రకా రం ఏమి తయారు చేశారో వంట సిబ్బందిని ఆరా తీశారు.
విద్యార్థులకు పోషకాహారంతో కూడిన సమతుల్యమైన భోజనం అందేలా చూసుకోవాలని, మెనూ ప్రకారం భోజనం వడ్డించడంలో ఎలాంటి లోపం లేకుండా పాఠశాల యాజమాన్యం మరియు వంట సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శోభ రాణి, తహశీల్దార్ సలీముద్దీన్, స్పెషల్ ఆఫీసర్స్ గోవిం దయ్య, షకీలా భాను, సంగీత లక్ష్మి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.