వసతి గృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): వసతి గృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చి, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర పౌరసరఫరాల కార్యదర్శి, మత్స్యశాఖ డైరెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీనియర్ ఐఏఎస్ అధికారుల సోషల్, మైనారిటీ, బీసీ, గిరిజన సంక్షేమ హాస్టల్లో రాత్రి తనిఖీ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం జిల్లాలో పాల్వంచలోనీ బొల్లోరి గూడెంలో గల టీజీ ఎంఆర్ఎఫ్ వసతి గృహం, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల కళాశాలను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె వసతి గృహాల గదులను పరిశీలించారు. అనంతరం స్టోర్ రూమ్ లో నిల్వ ఉంన్న బియ్యం ఆహార పరిశీలించారు. కిచెన్ షెడ్ లో విద్యార్థులకు అందిస్తున్న భోజనం తయారిని పరిశీలించి వంటకు పరిశుభ్రమైన నీటిని వినియోగించాలని మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. విద్యార్థులతో మమేకమై ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. ఏమైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం ఆమె సిబ్బంది యొక్క హాజరు రిజిస్టర్లను పరిశీలించారు.
అనంతరం డాక్టర్ ప్రియాంక అల ఐఏఎస్ మాట్లాడుతూ... ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనం, అల్పాహారం కలుషితం కాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భోజనం వండడానికి ముందే ప్రతీ రోజు క్రమం తప్పకుండా ఆహార పదార్థాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నాసిరకం, నాణ్యతా లేమితో కూడిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని ఆదేశించారు. సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు. నాసిరకమైన బియ్యం, ఇతర ఆహార పదార్థాలు, కూరగాయలు సరఫరా చేసినట్లైతే తహశీల్దాం కు సమాచారం అందించాలని, వాటి స్థానంలో నాణ్యమైన సరుకులు కేటాయించేలా చర్యలు తీసుకుంటారని కలెక్టర్ సూచించారు. విద్యార్థిని, విద్యార్థులకు అందించే భోజనం విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.ప్రతిరోజూ ఉపాధ్యాయులు వంతుల వారీగా ఆహార పదార్థాల నాణ్యతను తప్పనిసరి పరిశీలించాలని ఆదేశించారు. కాగా, జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాల్లో నీటి వసతి, మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలలో మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు,, పాల్వంచ ఎంఆర్ఓ వివేక్ మున్సిపల్ కమిషనర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.