17 తేమ శాతం రాగానే ధాన్యం కొనుగోలు చేయాలి
మంథని మండలంలో విస్తృతంగా పర్యటనలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి, (విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ మంథని మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని నాగారం, పి.పి.సి,కన్నాల, పి.పి.సి ,గుంజపడుగు, పి.పి. సి, జడ్పీ హెచ్ఎస్ స్కూల్, చిల్లపల్లి ఐ .కే. పి. గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం నాణ్యతను నిరంతరం పరిశీలించాలని, ధాన్యం తేమ శాతం 17 రాగానే వెంటనే కొనుగోలు చేసి, సెంటర్ కు కేటాయించిన రైస్ మిల్లులకు త్వరితగతిన తరలించే లా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 100% కొనుగోలు చేసిన ధాన్యం వివరాల ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని, సూచించారు.
కన్నాల గుంజపడుగు గ్రామాలలోని సెంటర్ లను సాయంత్రం లోపు లిఫ్ట్ చేయాలనీ, వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి వెంటనే పంపాలని ఆదేశించారు. రైస్ మిల్లుల వద్ద ఎటువంటి కోతలు లేకుండా చూడాలన్నారు. మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యమైన పదార్థాలు మాత్రమే వాడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పాఠశాలల్లో ఉన్న సరుకులను కలెక్టర్ పరిశీలించారు.అనంతరం విద్యార్థులతో మాట్లాడారు.మధ్యాహ్నం భోజనం కింద పిల్లలకు అందించే ఆహారం నాణ్యతతో ఉండాలని, పాఠశాలకు సరుకులు వచ్చే సమయంలో నాణ్యతను పరిశీలించి స్వీకరించాలని అధికారులకు తెలిపారు. పిల్లలకు అందించే ఆహారం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి పొరపాట్లు జరగడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో అగ్రికల్చర్ ఏ.డి.అంజనీ, సిబ్బంది నరేష్, పద్మ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.