calender_icon.png 31 October, 2024 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

06-07-2024 12:00:00 AM

స్పీకర్ ప్రసాద్ కుమార్ 

వికారాబాద్, జూలై 5 (విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాలుర పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలుసుకున్న స్పీకర్.. కలెక్టర్ ప్రతీక్ జైన్, మున్సిపల్ చైర్‌పర్సన్ మంజుల రమేశ్‌తో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. అస్వస్థతకు గల కారణాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అనంతగిరిపల్లిలోని రెసిడెన్షియ ల్ పాఠశాలకి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేశారు.  

పనులను వేగవంతం చేయాలి

వికారాబాద్ రూరల్: వికారాబాద్ జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని స్పీకర్ ప్రసాద్ కు మార్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించా రు. కలెక్టరేట్‌లోని స్టేట్ ఛాంబర్‌లో వికారాబాద్ ఫ్లుఓవర్ బ్రిడ్జి, ఆసుపత్రి, మెడికల్ కళాశాల నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.