అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క
హనుమకొండ, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): వసతి గృహాల్లో విద్యార్థులకు మె నూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అ ందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచించారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని గ డిగడ్డ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృ హాన్ని కలెక్టర్ దివాకరతో కలిసి ఆమె సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి విద్యార్థు లతో మాట్లాడి వసతి సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? లేదా అని విద్యార్థులను అడిగి తెలు సుకున్నారు.
వారివెంట ఏటీడీవో దేశిరాం, జిల్లా షెడ్యూల్ కులాల అధికారి బానోత్ ల క్ష్మణ్, డీవీహెచ్‌వో కొమురయ్య, డీడబ్యూవో ఇన్‌చార్జి శిరీష, డీపీవో దేవ్‌రాజ్, ఎంపీడీవో రామకృష్ణ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ములుగు జిల్లా ఏటూర్ నాగారం మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి సీతక్క ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రజక నాయకులు పాల్గొన్నారు.