calender_icon.png 25 December, 2024 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువుల్లో నాణ్యమైన చేప పిల్లలు

08-10-2024 12:37:45 AM

ఫిషరీస్ చైర్మన్ సాయికుమార్

మంథని, అక్టోబర్ 7 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రాష్ట్రంలో నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నా రు. సోమవారం మంతని పట్టణంలోని తమ్మి చెరువులో రాష్ట్ర మత్స్యశాఖ అధ్వర్యంలో 40,000 వేల ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారని చెప్పారు.

కాగా మత్స్యశాఖ డైరెక్టర్ క్రాంతికుమార్ మా ట్లాడుతూ.. ఆగస్టు నెలలోనే పంపిణీ చేయాల్సిన చేప పిల్లలను ఆలస్యంగా వదలడంతో మత్స్యశాఖ కుటుంబాలు నష్టపోతున్నాయని ఆరోపిం చారు. దీంతో చైర్మన్‌తో పాటు మంథ ని మున్సిపల్ చైర్మన్ రమ క్రాంతికుమార్‌తో కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. కార్యక్ర మం లో పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, వైస్ చైర్మ న్ శ్రీపాద బానయ్య, కౌన్సిలర్లు చొప్పకట్ల హనుమంతూ, సమ్మయ్య, నక్క నాగేంద్ర పాల్గొన్నారు.