01-04-2025 09:38:21 AM
హైదరాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలో పేదల ఆహార భద్రతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండ్రోజుల కిందట హుజూర్ నగర్ వేదికగా సన్నబియ్యం పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అయితే సన్నబియ్యం పంపిణీ పథకాన్ని మంగళవారం నుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ పంపిణీ కార్యక్రమాల్లో అన్ని జిల్లాల్లో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పంపిణీ చేయనున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ పథకం హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలో ఆరంభం కానుంది. 85 శాతం మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సన్నబియ్యం కానుంది.