calender_icon.png 7 February, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ విధానంతో నాణ్యమైన విద్య

07-02-2025 01:54:43 AM

* ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): దేశంలో నాణ్యమైన విద్య అందించేందుకు డిజిటల్ విద్యావిధానం ఎంతో ఉపయోగపడుతుందని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి అన్నారు.

గురువారం ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ మల్టీమీ డియా రీసెర్చ్ సెంటర్(ఈఎంఆర్‌సీ) హైదరాబాద్, కన్‌సోర్టియమ్ ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్(సీఈసీ) న్యూఢిల్లీ ఆధ్వర్యం లో ఓయూ సెంటినరీ ఆడిటోరియంలో అధ్యాపకులతో రెండు రోజుల వర్క్‌షాప్‌ను బాలకిష్టారెడ్డి ప్రారంభించి, మాట్లాడారు.

అధ్యాపకులు నిరంతరం నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలన్నారు. నైపుణ్యాలు లేకపోవడం వల్లే విద్యార్థులు ఉద్యోగావకాశా లకు దూరమవుతున్నా రు. ఒక్క మెరైన్ రంగంలోనే 20లక్షల ఉద్యోగా వకాశాలున్నాయని చె ప్పారు. సీఈసీ, ఈఎమ్మార్సీ అందించే కోర్సులు విద్యార్థుల నైపుణ్యాల మెరుగుదలకు ఉపయోగపడుతాయన్నారు.

ఓయూ ఈఎమ్మార్సీ ద్వారా డిజిటల్ పాఠాల రూపకల్పనకు ముందుకు రావాలని సీఈసీ డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్‌భూషణ్‌నడ్డా అన్నారు. మారుతున్న డిజిటల్ యుగంలో అధ్యాపకుల పాత్ర కీలకమని ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జీ నరేష్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఓయూ యూజీసీ డీన్ ప్రొ. బీ లావణ్యచ ఈఎమ్మార్సీ డైరెక్టర్ పి.రఘుపతి పాల్గొన్నారు.