calender_icon.png 27 November, 2024 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

27-11-2024 08:53:47 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్..

కామారెడ్డి (విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన బోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా సరంపల్లి గ్రామంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను కలెక్టర్ సందర్శించారు. తొలుత కలెక్టర్‌కు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. రెసిడెన్షియల్ స్కూల్, కళాశాలలో విద్యార్థుల సంఖ్య విద్యాబోధన అంశాలను ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మంచి విద్య,మంచి బోజనం మెను ప్రకారం అందించాలన్నారు. హాస్టల్ పరిసరాలను సందర్శించి హస్టల్ పరిసరాలను పరిశీలించారు. నిల్వ ఉన్న నీటిని తొలగించాలని తెలిపారు. నీటి పైప్ లైన్ లీకేజీలను సరి చేయాలని తెలిపారు. 

స్టోర్ రూంలను పరిశీలించి స్టాక్ ఎప్పుడు వచ్చింది, స్టాక్ ఎంట్రీ నమోదులను పరిశీలించారు. బియ్యంలో రాళ్లు, పురుగులు లేకుండా శుభ్రం చేసి వంటకు ఉపయోగించాలని, ఇతర సరుకులు సరిచేయాలని తెలిపారు. వంటకాలు శుభ్రంగా రుచికరంగా చేయాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో సహ కలెక్టర్ భోజనం చేశారు. విద్యార్థులకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సబ్బులను ఏర్పాటు చేయాలన్నారు. హస్టల్ పరిసరాల్లో శానిటేషన్ నిర్వహించాలని, మున్సిపల్ డిప్యూటి ఈఈని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రజిత, ప్రిన్సిపాల్ అమర్‌సింగ్, రీజనల్ కో ఆర్డినేటర్ గంగారంనాయక్, పుడ్ సేప్టి అధికారి శిరీష, తహశీల్దార్ సాయిలు, మున్సిపల్ డిప్యూటి ఈఈ వేణుగోపాల్, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.