26-04-2025 01:02:17 AM
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
కోదాడ ఏప్రిల్ 25 : ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా భోదించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో కోదాడ నియోజకవర్గం పరిధిలోని కోదాడ, మునగాల, నడిగూడెం, అనంతగిరి, చిలుకూరు మండలాలకి చెందిన ఎం ఈ ఓ, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో ఫౌండేషన్ లీటరసీ న్యూమరసీ పై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో చక్కగా చదువు చెప్తామని విద్యార్థుల్లో నమ్మకం కల్గించి వచ్చే విద్యా సంవత్సరంకి ఎక్కువ మంది విద్యార్థులు నమోదు అయ్యేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. డిఈఓ ఆశోక్, క్వాలిటీ కో ఆర్డినేటర్ జనార్దన్, ప్లానింగ్ కో ఆర్డినేటర్ శ్రవణ్ కుమార్, ఇంక్లూజివ్ కో ఆర్డినేటర్ రాంబాబు, జనరల్ ఈక్వలిటీ కో ఆర్డినేటర్ పూలమ్మ, ఎం ఈ ఓ లు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, పాల్గొన్నారు.