calender_icon.png 1 March, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన విద్యాబోధన చేయాలి

01-03-2025 12:00:00 AM

కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట, ఫిబ్రవరి 28(విజయక్రాంతి): ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు నాణ్యమైన విద్యాబోధన గావించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ నారాయణపేట  ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సింగార్చేస్, భవిత కేంద్రంను సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో భాగంగా ప్రత్యేకఅవసరాలుగల పిల్లలకు బోధన ఏవిధంగా జరగుతుందో తనిఖీ చేశరు. కార్యక్రమంలో ఐఈ కోఆర్డినేటర్ రాజేంద్ర కుమార్, యాదయ్యా శెట్టి, శ్రీనివాస్ సెక్టోరియల్ ఆఫీసర్, ఎంఈఓ బాలాజీ, శ్రీనివాస్, విజయలక్ష్మి పాల్గొన్నారు.

స్కూల్ కాంప్లెక్స్ పనులు పూర్తిచేయాలి

యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్సియల్ స్కూల్  కంప్లెక్స్ పనులు త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. నారాయణపేట మండలం లింగంపల్లి శివారు సర్వే నెంబర్ 30 లో గల 20 ఎకరాలలో నిర్మించ తలపెట్టిన  పాఠశాల   స్థలాన్ని జిల్లా కలెక్టర్  శుక్రవారం ఉదయం సందర్శించారు. రాష్ర్ట ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగిందని వాటికీ సంబందించిన పనులను త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. సుమారు రూ.200 కోట్లతో నిర్మిస్తున్న భవన నిర్మాణానికి సంబందించిన ఏర్పాట్లు త్వరితగిన మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా డీప్యూటీ ఈ. ఈ.రాము, తహసీల్దార్ అమరేంద్ర క్రిష్ణ ఉన్నారు.