calender_icon.png 18 October, 2024 | 6:49 PM

నాణ్యమైన విద్యను అందించాలి..

18-10-2024 04:52:29 PM

మోడల్ స్కూల్ తనిఖీ చేసిన కలెక్టర్ హనుమంత్ కే.జెండగే 

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జెండగే ఆదేశించారు. శుక్రవారం గుండాల మండలం పాచిల్ల గ్రామములోని మోడల్ హైస్కూల్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్కూల్ లో చదువుతున్న బైపిసి, సిఇసి మొదటి సంవత్సరం చదువుచున్న విద్యార్థి, విద్యార్థులతో కలెక్టర్ ముఖముఖంగా ముచ్చటించారు. సబ్జెక్టుల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మంచిగా చదువుకొని పోటీ తత్వంలో ముందుకు వెళ్లాలని అన్నారు. మీరు మంచిగా చదువుకోని మీ తల్లి తండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలని విద్యార్థులకు హితవు పలికారు. మోడల్ స్కూల్ లో చదువుకునే విద్యార్థుల యొక్క హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. ప్రతి విద్యార్థి ఈ సంవత్సరం మెరిట్ మార్కులు సాధించేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలన్నారు. స్కూల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నిమౌళిక వసతులు కల్పించాలన్నారు. పాఠశాలలో ఏమి అయినా పెండింగ్ పనులు వుంటే త్వరగా పూర్తి చేయాలని  కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల తహసిల్దార్, జలకుమారి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాము, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.