calender_icon.png 16 October, 2024 | 5:49 PM

రెసిడెన్షియల్స్‌లో నాణ్యమైన విద్యనందించాలి

16-10-2024 03:34:23 AM

  1. మెస్‌చార్జీల పెంపుపై కసరత్తు చేపట్టాలి
  2. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, అక్టోబర్ 15(విజయ క్రాంతి): ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ప్రభుత్వ రెసిడెన్షి యల్ విద్యాసంస్థల కార్యదర్శులతో మంగళవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. నిపుణుల సహాయంతో ఉపాధ్యాయుల బోధన విధానాన్ని పరిశీలించి.. అవసరమైన సలహాలు, సూచనలు ఇప్పించాలని పేర్కొన్నారు. విద్యార్థుల మెస్, కాస్మోటిక్స్ బిల్లులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని.. ధనలో నాణ్యత పెంపు విషయమై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రెసిడెన్షియల్ విద్యా సంస్థల సెక్రటరీలు నిత్యం ఓ పాఠశాలను పరిశీలించి, సమీక్షించి.. నెలాఖరులోగా నివేదిక ఇవ్వాలని సూచించారు. అద్దె భవనాల బిల్లుల పెండింగ్‌లపై నిధుల విడుదలకు ఆదేశాలు జారీచేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలు పెంచాలని నిర్ణ యం తీసుకున్నామని తెలిపారు.

సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారా వు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణభాస్కర్, రెసిడెన్షియల్ పాఠశాలల సెక్రటరీలు సైదులు, తఫ్సీల్ ఇక్బాల్, సీతాలక్ష్మి, అలుగు వర్షిణి పాల్గొన్నారు.