calender_icon.png 26 April, 2025 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య

25-04-2025 07:43:50 PM

దౌల్తాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలు చేర్పించి మరింత బలోపేతం చేయాలని మండల విద్యాధికారి కనకరాజు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని శేరిపల్లి, కోనాపూర్ లో నిర్వహించిన ముందస్తు బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు భోజనం, దుస్తులు, పుస్తకాలు, కంప్యూటర్ ఆధారిత బోధన అందిస్తున్నామని తల్లిదండ్రులకు వివరించారు. తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి, ఉపాధ్యాయురాలు అమల, హర్షిణి తదితరులు పాల్గొన్నారు.