- మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్
- వడియారం జడ్పీహెచ్‌ఎస్ పరిశీలన
చేగుంట, జనవరి 18 : ప్రభుత్వ పాఠశాలల్లో కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన గుణాత్మక విద్యను అందిస్తున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శనివారం చేగుంట మండలం వడియారం జిల్లా పరిషత్ పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ముందుగా జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగ ణాన్ని, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, తరగతి గదులు, కిచెన్ డైనింగ్ హాల్స్ ను కలెక్టర్ పరిశీలించారు.
తరగతి గదులలో ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థినీ విద్యా ర్థులకు పాఠాలు బోధించి సామర్థ్యాలను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల వసతుల కల్పనకు సేగల్ ఫౌండేషన్ వారి సేవలు అభినందనీయమని తెలిపారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు వారిని ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలకు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. రాబోయే పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.