calender_icon.png 23 November, 2024 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య

22-11-2024 06:46:42 PM

దౌల్తాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని ప్రధానోపాధ్యాయులు ఎండి అఫ్జల్ అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గడ్డమీద రేఖతో కలిసి సైన్సు లేబొరేటరీ, కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యతో పాటు కంప్యూటర్, ల్యాబొరేటరీతో ఎంతో నైపుణ్యం చేకూరుతుందన్నారు. దీంతో పాటు ప్రాక్టికల్స్ చేయడం ద్వారా విద్యార్థుల మేధస్సు పెరుగుతుందని తెలిపారు. అలాగే ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలతో మంచి ఫ్యాకల్టీతో ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన జరుగుతుందన్నారు. విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం, తదితరులు పాల్గొన్నారు.