calender_icon.png 27 November, 2024 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య

05-11-2024 03:07:47 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తోందని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీయుపిఎస్ ప్రభుత్వ పాఠశాలలో రూమ్ టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలో ఏర్పాటు చేసిన లైబ్రరీని మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా రాష్ట్రంలోని పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. తల్లి తండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలోనే చేర్పించాలని సూచించారు. పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు పిన్న వయస్సులోనే ఉన్నత లక్ష్యం పెట్టుకొని, ఆ దిశగా పయనించాలన్నారు. విద్యార్థులు చిన్న తనం నుంచే పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని సూచించారు. పుస్తకాలను పఠనం చేయడం ద్వారా జ్ఞానం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.