calender_icon.png 21 February, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే నాణ్యమైన విద్య

18-02-2025 12:41:46 AM

నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే నాణ్యమైన విలువలతో కూడిన విద్య అందుతోందని స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో డిగ్రీ కళాశాల నూతన అడ్మిషన్స్ కరపత్రాలను విడుదల చేశారు.

ఇంటర్ పూర్తున విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరి అందుబాటులో ఉన్న ఉచిత సేవలను ఉపయోగించుకుని మంచి స్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అంజయ్య, ఏవో మహమ్మద్ ఇర్ఫాన్, సీనియర్ అధ్యాపకుడు కోదండరాములు, ఇతర కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.